గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు
ABN , First Publish Date - 2022-03-06T03:37:58+05:30 IST
మండలంలోని కంటేపల్లి - గొలగమూడి మార్గంమధ్యలోని పొలాల్లో పడి ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం పో
వెంకటాచలం, మార్చి 5 : మండలంలోని కంటేపల్లి - గొలగమూడి మార్గంమధ్యలోని పొలాల్లో పడి ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. సుమారు 55 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించి ఉన్నాడు. నల్లని శరీరఛాయ కలిగి ఉన్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఎస్ఐ శివనాంచారయ్య తెలిపారు. మృతుడు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎలా చనిపోయాడు.. అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.