మురుగు గుంటలైనా ఏర్పాటు చేయించండి
ABN , First Publish Date - 2022-06-26T03:52:01+05:30 IST
‘మా ఇళ్లకు మురుగు గుంటలైనా ఏర్పాటు చేయించండయ్యా’.. అంటూ ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో ఆ పార్టీ నేత
బుచ్చిరెడ్డిపాళెం,జూన్25: ‘మా ఇళ్లకు మురుగు గుంటలైనా ఏర్పాటు చేయించండయ్యా’.. అంటూ ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో ఆ పార్టీ నేతల ముందు జొన్నవాడ వాసులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. శనివారం జొన్నవాడలో ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. మురుగు కాలువలు కట్టించకపోయినా ఫరవాలేదు. కనీసం మురుగు గుంటలైనా ఏర్పాటు చేయించండని ప్రజలు సీపీఎం నేతలను వేడుకున్నారు. ఆధార్ సవరణలు, పెరిగిన నిత్యావసరాలు, జగనన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలుతోపాటు పలు సమస్యలపై ప్రజలు వారి ముందు ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తంబి రమణయ్య, కందికట్టు వెంకటరమణయ్య, మద్దిఽశెట్టి సురేష్, తదితరులు పాల్గొన్నారు.