ఎంపీపీకి ఎమ్మెల్యే నివాళి

ABN , First Publish Date - 2022-03-06T03:48:14+05:30 IST

పొదలకూరు ఎంపీపీ నిమ్మళ్ల విజయమ్మకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శనివారం నివాళులర్పించారు. గుండెపోటుతో

ఎంపీపీకి ఎమ్మెల్యే నివాళి
విజయమ్మ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే కాకాణి

పొదలకూరురూరల్‌, మార్చి 5 : పొదలకూరు  ఎంపీపీ నిమ్మళ్ల విజయమ్మకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శనివారం నివాళులర్పించారు. గుండెపోటుతో  ఎంపీపీ శుక్రవారం హఠాన్మరణం చెందిన విషయం విదితమే. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మండలంలోని పులికల్లులో గల ఆమె నివాసానికి వెళ్లి  పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంద ర్భంగా ఆయన భర్త, పిల్లలను ఓదార్చారు. ఆమె కుటుం బానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. 


Read more