ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి

ABN , First Publish Date - 2022-10-07T03:36:15+05:30 IST

తూర్పు రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి గురువారం తన ఓటును నమోదు చేసుకున్నారు.

ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి
పట్టభద్రుల ఓటుహక్కు కోసం దరఖాస్తు అందజేస్తున్న కంచర్ల శ్రీకాంత్‌

కందుకూరు, అక్టోబరు 6: తూర్పు రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి గురువారం తన ఓటును నమోదు చేసుకున్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌కు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ పట్టభద్రులు  పట్టణ ప్రాంతాలవారైతే మున్సిపల్‌ కార్యాలయంలోనూ, గ్రామీణ ప్రాంతాల వారు తహసీల్దార్‌ కార్యాలయంలోనూ దరఖాస్తులు అందజేయాలని కోరారు. అలాగే ఆర్డీవో కార్యాలయంలోనూ దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఓటుకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. 

Read more