పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , First Publish Date - 2022-06-08T03:15:11+05:30 IST

మనబడి నాడు-నేడు రెండో దశ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎంఈవో షేక్‌ మస్తాన్‌వలి సూచించారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈవో మస్తాన్‌వలి

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 7: మనబడి నాడు-నేడు రెండో దశ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎంఈవో షేక్‌ మస్తాన్‌వలి సూచించారు. మంగళవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సీఆర్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో దశలో మండలంలో 16 పాఠశాలలు ఎంపిక కాగా 5 పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయన్నారు. పాఠశాలకు కావాల్సిన స్మార్ట్‌ టీవీలు, డ్యూయల్‌డె్‌స్కలు, ఫర్నిచర్‌, ఫ్యాన్‌లు, లైట్లు, బోర్డులు ఎస్‌టీఎంఏ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రావణ్‌కుమార్‌, హెచ్‌ఎంలు వెంకటేశ్వర్లు, నూర్జహాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more