25న వీఎస్‌యూలో మెగా జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2022-07-22T05:03:08+05:30 IST

మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈనెల 25న మెగా జాబ్‌ మేళ నిర్వహిస్తున్నట్లు వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ పి. రామచంద్రారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

25న వీఎస్‌యూలో మెగా జాబ్‌ మేళా

వెంకటాచలం, జూలై 21 : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈనెల 25న మెగా జాబ్‌ మేళ నిర్వహిస్తున్నట్లు వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ పి. రామచంద్రారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాలో దేశ వ్యాప్తంగా ఉన్న 60 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, 15 వేల ఖాళీలకు గాను ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. 1000 మంది దరఖాస్తుదారులు ఇప్పటికే గూగుల్‌ ఫారం ద్వారా రిజిస్ర్టేషన్‌ పొందారని, ఈనెల 25 నాటికి ఆ సంఖ్య 6 వేలకు చేరుతుందని పేర్కొన్నారు. జాబ్‌ మేళాకు డాక్టర్‌ పి. చెంచురెడ్డి ట్రైనింగ్‌, ప్ల్లేస్మెంట్‌ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మేళాకు  అభ్యర్థులు తమ బయోడేటా, జెరాక్స్‌ కాపీ ధ్రువపత్రాలను తేచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగాలకు డిగ్రీ, బీటెక్‌, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమో పూర్తి చేసిన వారు అర్హులని  తెలిపారు.

Updated Date - 2022-07-22T05:03:08+05:30 IST