-
-
Home » Andhra Pradesh » Nellore » medical camp-MRGS-AndhraPradesh
-
ఇనుకుర్తి గ్రామంలో వైద్య శిబిరం
ABN , First Publish Date - 2022-09-28T03:58:39+05:30 IST
మండలంలోని ఇనుకుర్తి గ్రామంలో మహమ్మదాపురం పీహెచ్సీత డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు.

పొదలకూరు, సెప్టెంబరు 27 : మండలంలోని ఇనుకుర్తి గ్రామంలో మహమ్మదాపురం పీహెచ్సీత డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ సిబ్బంది ఇంటింటా తిరిగి లార్వా సర్వే చేశారన్నారు. వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. వాటి వల్ల డెంగ్యూ, చికున్గున్యాయా, మలేరియా, టైపాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఈ వైద్య శిబిరాన్ని నెల్లూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దయాకర్ పరిశీలించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ఆంజనేయవర్మ, ఆరోగ్య విస్తరణాధికారి రవికుమార్, హెల్త్ సూపర్వైజర్ ఖాదర్బాషా, రమణమ్మ, సచివాలయం ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.