-
-
Home » Andhra Pradesh » Nellore » mattito cestaga karigedi-MRGS-AndhraPradesh
-
మట్టితో చేస్తేగా కరిగేది ?
ABN , First Publish Date - 2022-09-09T03:03:26+05:30 IST
నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నీటిలో మునగీమునకగా, కరిగిపోకుండా ఉన్నాయి. చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువల్లో కొద్దిగా ఉన్న

ఉదయగిరి రూరల్, సెప్టెంబరు 8: నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నీటిలో మునగీమునకగా, కరిగిపోకుండా ఉన్నాయి. చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువల్లో కొద్దిగా ఉన్న నీటిలో విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అవి కరగక అటుగా వెళుతున్న ప్రజలు, వాహనదారుల కంటపడుతుండడంతో వినాయక మన్నించు స్వామీ... అంటూ ప్రజలు వేడుకొంటున్నారు. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు అయితే కరిగిపోయేవని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేయడంతో విగ్రహాలు అంతత్వరగా కరగవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.