మట్టి తోలుకుంటాం.. అనుమతివ్వండి !

ABN , First Publish Date - 2022-05-20T03:11:18+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పశువుల పాకలు, ఇళ్ల పరిసర ప్రాంతాలకు మట్టితోలుకునేందుకు అనుమతి ఇవ్వాల

మట్టి తోలుకుంటాం.. అనుమతివ్వండి !
డీటీకి వినతిపత్రం ఇస్తున్న గ్రామస్థులు

దగదర్తి, మే19: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పశువుల పాకలు, ఇళ్ల పరిసర ప్రాంతాలకు మట్టితోలుకునేందుకు అనుమతి ఇవ్వాలని వెలుపోడు గ్రామస్థులు డిప్యూటీ తహసీల్దారు అశోక్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం తహసీల్దార్‌  కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ గ్రామంలో చాలా మంది పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని పశువుల పాకలు, ఇళ్ల పరిసర ప్రాంతాలు దెబ్బతిని బురదమయం అయ్యాయని తెలిపారు. వాటిని సరిచేసుకునేందుకు మట్టితోలుకునేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు శ్రీహరి, సీహెచ్‌.పవన్‌, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T03:11:18+05:30 IST