ప్రశ్నిస్తే దాడులా?: Nara Lokesh
ABN , First Publish Date - 2022-05-22T21:54:09+05:30 IST
సంతపేట పోలీస్ స్టేషన్ సమీపంలో టీడీపీ నాయకురాలు రేవతిపై వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన వారిపై

నెల్లూరు: సంతపేట పోలీస్ స్టేషన్ సమీపంలో టీడీపీ నాయకురాలు రేవతిపై వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం.. వైసీపీ నాయకుల అభద్రతా భావాన్ని బయటపెడుతోందన్నారు. మాజీ మంత్రి అనిల్‌పై విమర్శలు చేశారనే అక్కసుతో రేవతి భర్తను పోలీస్‌స్టేషన్‌కి పిలిచి వేధించడం అన్యాయమన్నారు. స్టేషన్‌కి వెళ్ళిన రేవతిపై దాడి చేయడం చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రేవతిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, ఆమె భర్తను వేధించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.