ఐదో రోజుకు మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2022-02-20T04:40:23+05:30 IST

నగరంలో మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న ఆందోళన శనివారానికి ఐదో రోజుకు చేరుకుంది.

ఐదో రోజుకు మున్సిపల్‌ కార్మికుల ఆందోళన
ఆందోళన చేస్తున్న కార్మికులు

నెల్లూరు (వైద్యం) ఫిబ్రవరి 19 : నగరంలో మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న ఆందోళన శనివారానికి ఐదో రోజుకు చేరుకుంది. తెల్లవారు జామున నగరంలోని 21,39,40,43,47 డివిజన్లలోని మస్టర్ల వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మున్సిపల్‌ కార్మికుల వెట్టి చాకికీకి గురవుతున్నారు. 10 మంది చేసే పనిని ఒక్కరి చేతే చేయిస్తున్నారని చెప్పారు. మున్సిపల్‌ కార్మికులకు క్యాజులవ్‌ లీవ్‌లు, సెలవులు ఇవ్వాలన్నారు. చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. మున్సిపల్‌ కార్మికును రెగ్యులర్‌ చేయాలన్నారు. పనికితగిన సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు, అల్లాడి గోపాల్‌, షేక్‌ ఫయాజ్‌, శ్రీనివాసులు, చంద్ర, పరంధామయ్య, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-20T04:40:23+05:30 IST