-
-
Home » Andhra Pradesh » Nellore » Kurugondla canvasing in andaman nicobar ilands-MRGS-AndhraPradesh
-
అండమాన్ నికోబార్ దీవుల్లో కురుగొండ్ల ప్రచారం
ABN , First Publish Date - 2022-03-06T03:38:30+05:30 IST
అండమాన్ దీవుల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు అనుకూలంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం అండమాన్ నికోబార్ దీవుల టీడీపీ ఇన్చార్జి వెంపటి మాధవనాయుడుతో కలిసి ప్రచారం నిర్వహించారు.

వెంకటగిరి, మార్చి 5 : అండమాన్ దీవుల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు అనుకూలంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం అండమాన్ నికోబార్ దీవుల టీడీపీ ఇన్చార్జి వెంపటి మాధవనాయుడుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో ఫోన్లో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు విజయానికి ప్రవాస భారతీయుల ఓట్లు కీలకం కానున్నాయన్నారు. ప్రవాస భారతీయులందరిని కలుసుకుని టీడీపీ మద్దతుదారులకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్ధిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీనే మున్సిపాలిటీని కైవసం చేసుకొంటుందని తెలిపారు. మాధవనాయుడు మాట్లాడుతూ అండమాన్ నికోబార్ దీవుల్లో టీడీపీ అభ్యర్థుల విజయం తథ్యమని జోస్యం చెప్పారు. ఇక్కడ టీడీపీ కి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.