కుళ్లిన కోడిగుడ్లపై విచారణ
ABN , First Publish Date - 2022-09-15T03:05:04+05:30 IST
భోజన సమయంలో కుళ్లిన కోడిగుడ్లు ఉన్నది వాస్తవమే. కానీ వాటిని పిల్లలకు సరఫరా చేయలేదని నెల్లూరు డిప్యూటి
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
మనుబోలు, సెప్టెంబరు 14: భోజన సమయంలో కుళ్లిన కోడిగుడ్లు ఉన్నది వాస్తవమే. కానీ వాటిని పిల్లలకు సరఫరా చేయలేదని నెల్లూరు డిప్యూటి డీఈవో భిక్షాలు తేల్చారు. మధ్యాహ్న భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు అంటూ బుధవారం ఆంద్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనిపై డీఈవో రమేష్ స్పందించారు. ఆయన ఆదేశాలతో డిప్యూటి డీఈవో మనుబోలు బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుళ్లిన కోడిగుడ్లపై విచారణ చేపట్టారు. పిల్లలకు పెడుతున్న భోజనాన్ని రుచి చూశారు. ఉపాధ్యాయులతో, పీఎంసీ కమిటీ చైర్మన్తో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుళ్లిన కోడిగుడ్లను పిల్లలకు అందజేయలేదని తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డేవిడ్, పీఎంసీ కమిటీ చైర్మన్ సునీత, కో-ఆప్షన్ సభ్యుడు అనమాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.