కృష్ణపట్నం పోర్టులో ప్రివిలేజెస్‌ కమిటీ

ABN , First Publish Date - 2022-01-29T04:06:53+05:30 IST

అదానీ కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం శాసనసభ ప్రివిలేజెస్‌ కమిటీ సభ్యులు పర్యటించారు.

కృష్ణపట్నం పోర్టులో ప్రివిలేజెస్‌ కమిటీ
పోర్టులో మొక్కలు నాటిన ప్రివిలేజెస్‌ కమిటీ సభ్యులు

ముత్తుకూరు, జనవరి 28: అదానీ కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం శాసనసభ ప్రివిలేజెస్‌ కమిటీ సభ్యులు పర్యటించారు. జిల్లా పర్యటనలో భాగంగా గొలగమూడి నుంచి నేరుగా కృష్ణపట్నం పోర్టు చేరుకున్నారు. పోర్టు ప్రతినిధులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో పోర్టులో ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను పరిశీలించారు. బోటులో కండలేరు క్రీక్‌లో పర్యటించి పోర్టు బెర్తుల నిర్మాణం, అభివృద్థి పనులను పరిశీలించారు. పోర్టు ప్రాంగణంలో ప్రివిలేజెస్‌ కమిటీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు కమిటీ సభ్యులు మొక్కలు నాటారు.   కార్యక్రమంలో కమిటీ సభ్యులు విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి అప్పలనాయుడు, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి, నాయకులు పోలిరెడ్డి చిన్నపరెడ్డి, నెల్లూరు శివప్రసాద్‌, రాగాల వెంకటేశ్వర్లు, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, పోర్టు పీఆర్‌ హెడ్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


వెంకయ్యస్వామి సన్నిధిలో..

వెంకటాచలం : జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రివిలేజెస్‌ కమిటీ సభ్యులు గొలగమూడి భగవాన్‌ శ్రీవెంకయ్యస్వామి ఆశ్రమాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి, కమిటీ సభ్యులు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డిలకు ఆశ్రమ బాలసుబ్రహ్మణ్యం ఘనంగా స్వాగతం పలికారు. ఆనంతరం వీరందరి పేరిట ఆశ్రమ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రివిలేజెస్‌ కమిటీ సభ్యులందరికీ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆశ్రమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, ఆశ్రమ ప్రాశస్త్యం గురించి ప్రివిలేజెస్‌ కమిటీ సభ్యులకు ఆశ్రమ ఈవో  వివరించారు. కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, తహసీల్దారు ఐఎస్‌ ప్రసాద్‌, ఎంపీడీవో ఏ సరళ, ఆశ్రమ పాలక మండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పలువురు వైసీపీ నాయకులు తదితరులున్నారు. Read more