కావలి ఆర్టీసీ డిపోకు ఉత్తమ మోటివేటర్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-10-02T04:11:53+05:30 IST

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ కావలి డిపోకు ఉత్తమ రక్తదాన మోటివేటర్‌ అవార్డు లబించింది.

కావలి ఆర్టీసీ డిపోకు ఉత్తమ మోటివేటర్‌ అవార్డు
అవార్డును అందుకుంటున్న కావలి ఆర్టీసీ డిపో అసిస్టెంట్‌ మేనేజరు కేవీఆర్‌ బాబు

కావలి, అక్టోబరు 1: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ కావలి డిపోకు ఉత్తమ రక్తదాన మోటివేటర్‌ అవార్డు లబించింది. జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం నెలూరు రక్తదాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కావలి ఆర్టీసీ డిపో అసిస్టెంట్‌ మేనేజరు కేవీఆర్‌ బాబుకు ఈ అవార్డును జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మీ అందచేశారు. జిల్లా రెడ్‌క్రాస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది జాతీయ రోడ్డు భద్రతా పక్షోత్సవాలు సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఆర్టీసీ డిపోలలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో కావలి డిపో అధికారులు, కార్మికులు 151 మంది రక్తదానం చేసి ప్రథమస్థానంలో నిలిచి జిల్లా ప్రతిష్టను నిలబెట్టారని అభినందించారు.

Read more