రైతులకు నష్టం జరగకుండా పరిహారం
ABN , First Publish Date - 2022-07-21T03:57:54+05:30 IST
జాతీయ రహదారి 167బిజి విస్తరణకు సంబంధించి భూసేకరణలో భూములు కోల్పోతున్న భూ యజమానులకు నష్టం జరగకుండా పరిహారం అందుతుందని కావలి ఆర్డీవో శీనానాయక్ హామీ ఇచ్చారు.
కావలి ఆర్డీవో శీనానాయక్ హామీ
జలదంకి, జూలై 20: జాతీయ రహదారి 167బిజి విస్తరణకు సంబంధించి భూసేకరణలో భూములు కోల్పోతున్న భూ యజమానులకు నష్టం జరగకుండా పరిహారం అందుతుందని కావలి ఆర్డీవో శీనానాయక్ హామీ ఇచ్చారు. బుధవారం బాధిత రైతులతో స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. సమావేశానికి హాజరైన జలదంకి, కమ్మపాలెం, బీకే అగ్రహారం గ్రామాలకు చెందిన భూ యజమానులతో ఆర్డీవో మాట్లాడుతూ కావలి నుంచి దుత్తలూరు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. అందుకు సంబంధించి చేపట్టిన భూసేకరణలో భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలనకే మిమ్మల్ని పిలిపించామన్నారు. మీ భూ హక్కులు నకళ్లు రెవెన్యూ సిబ్బందికి అందజేస్తే చట్టప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు పలు సందేమాలను ఆర్డీవో ముందుంచగా అంతా చట్టప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో కార్యాలయ భూసేకరణ సిబ్బంది, డీటీ భరత్, ఆర్‌ఐ శ్రీజ, జలదంకి, బ్రాహ్మణక్రాక-2 వీఆర్‌వోలు పద్మ, శివ పాల్గొన్నారు.