అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-06-26T04:06:45+05:30 IST
కావలి పట్టణంలోని జవహర్ భారతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న డీఆర్ స్విమ్మింగ్ పూల్‌లో జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాలబాలికల విభాగాల్లో అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి.

అండర్-17 బాలబాలికల 1500 మీటర్ల విజేతలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసులు
కావలిటౌన్, జూన్ 25 : కావలి పట్టణంలోని జవహర్ భారతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న డీఆర్ స్విమ్మింగ్ పూల్‌లో జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాలబాలికల విభాగాల్లో అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకర మధు, సనత్‌కుమార్ పర్యవేక్షణలో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ పోటీల్లో అన్ని జిల్లాల బాలబాలికలు పాల్గొని సత్తా చాటుతున్నారు. మొదటి రోజు జరిగిన అండర్-17 బాలబాలికల ప్రీస్టైల్ 1500 మీటర్ల విభాగాల్లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన సంపత్‌కుమార్ యాదవ్, సీహెచ్ మౌనిక విజేతలుగా నిలిచి బంగారు పతకాలు దక్కించుకున్నారు. అలాగే బాలుర విభాగంలో రెండవ స్థానంలో కృష్ణా జిల్లాకే చెందిన కె జార్జి, మాడవ స్థానంలో తిరుపతి జిల్లాకు చెందిన మోనిత్ఉజ్వల్ నిలిచారు. బాలికల విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన ఆకాంక్ష రెండవ స్థానంలో, గుంటూరు జిల్లాకు చెందిన భవిక మూడవ స్థానంలో నిలిచారు. ఆదివారం బట్టర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్ తదితర అంశాల్లో పోటీలు జరగనున్నాయి. విజేతలకు విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి, లక్ష్మి దంపతులు, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి పతకాలు బహూకరించి అభినదించారు. ఈ కార్యక్రమంలో జేబీ ప్రిన్సిపాల్ ఆర్ మాల్యాద్రి, పీడీ ప్రసాద్ రెడ్డి, అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.