కసుమూరు దర్గాలో టీడీపీ బోర్డు సభ్యులు

ABN , First Publish Date - 2022-10-01T03:48:52+05:30 IST

మండలంలోని కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాను శుక్రవారం టీటీడీ బోర్డు సభ్యుడు మునికృష్ణమూర్తి కుటుంబ సమేతంగా నెల్లూరు రూ

కసుమూరు దర్గాలో టీడీపీ బోర్డు సభ్యులు
: కసుమూరు దర్గాలో టీటీడీ బోర్డు సభ్యుడు మునికృష్ణమూర్తి, రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

వెంకటాచలం, సెప్టెంబరు 30: మండలంలోని కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాను శుక్రవారం టీటీడీ బోర్డు సభ్యుడు మునికృష్ణమూర్తి కుటుంబ సమేతంగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి వచ్చి దర్శించుకున్నారు వారికి దర్గా ముజావర్లు, స్థానిక వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. వారి పేరిట దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, తహసీల్దార్‌ నాగరాజు, ఉపసర్పంచి పఠాన్‌ బాబర్‌, మైనార్టీ నాయకులు ఎంఎస్‌ మహమ్మద్‌, ఎంఎస్‌ దస్తగిరి, యూసుఫ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more