కామాక్షితాయికి కాసుల దండ బహూకరణ

ABN , First Publish Date - 2022-06-17T03:20:34+05:30 IST

జొన్నవాడ కామాక్షితాయికి తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన సోడెం మధుసూదన్‌రావు, మునిభారతమ్మ దంపతులు

కామాక్షితాయికి కాసుల దండ బహూకరణ
ఆలయ చైర్మన్‌కు కాసుల దండను అందజేస్తున్న దాతలు

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌16: జొన్నవాడ కామాక్షితాయికి తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన సోడెం మధుసూదన్‌రావు, మునిభారతమ్మ దంపతులు గురువారం  10 సవర్ల (80 గ్రాములు) బంగారు కాసుల దండను కానుకగా సమర్పించారు.  కాసుల దండను ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ,ఈవో డీ వెంకటేశ్వర్లుకు అందజేశారు. తమను కరోనా నుంచి కాపాడిన అమ్మవారికి  కాసుల దండను బహూకరించినట్లు దాతలు పేర్కొన్నారు. ముందుగా వారు స్వామి, అమ్మవారిని దర్శించుకుని, కల్యాణోత్సవం నిర్వహించారు.

Updated Date - 2022-06-17T03:20:34+05:30 IST