కందుకూరుకే తలమానికం ఎంఐజీ లేఅవుట్
ABN , First Publish Date - 2022-11-02T22:32:26+05:30 IST
కందుకూరుకే తలమానికం ఎంఐజీ లేఅవుట్ కందుకూరు, నవంబరు2: సకల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో సిద్ధమవుతున్న ఎంఐజీ లేఅవుట్ కందుకూరుకే తలమానికమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో ఎంఐజీ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన 32 మందికి లాటరీ పద్ధతిలో ప్లాట్ల ధ్రువపత్రాలను బుధవారం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ లేఅవుట్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తొలుత ఎంఐజీ లేఅవుట్‌కు కందుకూరుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, చక్కటి గ్రీనరీ, విశాలమైన పార్కు, కళ్యాణ మండపం అభివృద్ధి చేస్తామన్నారు. పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉన్నందున ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. పట్టణంలో కేవలం రెండు లేఅవుట్లుకు మాత్రమే పర్మిషన్ ఉందని గుర్తు చేశారు. కొన్ని ఏరియాల్లో ఆరడుగుల రోడ్లు కూడా ఉన్నాయని ప్రస్తుతం ఉన్న వాటిని అలాగే ఉంచి ఇకనుంచి నిర్మించబోయే నూతన గృహాల నిర్మాణదారులు ముందు భాగం వైపు కనీసం 30 అడుగుల రోడ్డు చూపించాలని చెప్పారు. కార్యక్రమంలో ఓనుడా వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ గోపాల్ రెడ్డి, ఓనుడా టౌన్‌ప్లానింగ్ అధికారిణి హిమబిందు, ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామమూర్తి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
కందుకూరుకే తలమానికం ఎంఐజీ లేఅవుట్
కందుకూరు, నవంబరు2: సకల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో సిద్ధమవుతున్న ఎంఐజీ లేఅవుట్ కందుకూరుకే తలమానికమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో ఎంఐజీ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన 32 మందికి లాటరీ పద్ధతిలో ప్లాట్ల ధ్రువపత్రాలను బుధవారం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ లేఅవుట్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తొలుత ఎంఐజీ లేఅవుట్‌కు కందుకూరుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, చక్కటి గ్రీనరీ, విశాలమైన పార్కు, కళ్యాణ మండపం అభివృద్ధి చేస్తామన్నారు. పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉన్నందున ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. పట్టణంలో కేవలం రెండు లేఅవుట్లుకు మాత్రమే పర్మిషన్ ఉందని గుర్తు చేశారు. కొన్ని ఏరియాల్లో ఆరడుగుల రోడ్లు కూడా ఉన్నాయని ప్రస్తుతం ఉన్న వాటిని అలాగే ఉంచి ఇకనుంచి నిర్మించబోయే నూతన గృహాల నిర్మాణదారులు ముందు భాగం వైపు కనీసం 30 అడుగుల రోడ్డు చూపించాలని చెప్పారు. కార్యక్రమంలో ఓనుడా వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ గోపాల్ రెడ్డి, ఓనుడా టౌన్‌ప్లానింగ్ అధికారిణి హిమబిందు, ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామమూర్తి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.