హిందువులు సనాతన ధర్మం, ఐక్యత పాటించాలి

ABN , First Publish Date - 2022-09-12T04:09:16+05:30 IST

హిందువులు సనాతన ధర్మంతోపాటు ఐక్యమత్యం పాటించాలని, హిందు ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని భవనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి అన్నారు.

హిందువులు సనాతన ధర్మం, ఐక్యత పాటించాలి
మాట్లాడుతున్న కమలానంద భారతీ స్వామి

కమలానంద భారతీ స్వామి

బిట్రగుంట, సెప్టెంబరు 11: హిందువులు సనాతన ధర్మంతోపాటు ఐక్యమత్యం పాటించాలని, హిందు ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని భవనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి అన్నారు. బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్‌ 6వ నగర సంకీర్త సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమలానంద భారతీ స్వామితో పాటు నెల్లూరు దత్తాత్రేయ పీఠాధిపతి మాతా అనంతనందగిరి, ఇనమడుగు ఆశ్రమంకు చెందిన శ్రీహరిస్వామి పాల్గొని హిందు ధర్మ పరిరక్షణపై ఆధ్యాత్మిక ప్రవచనలు చేశారు. హిందువుల ధర్మాని మరచి పోవడం వలన ఎక్కువగా మతమార్పిడిలు జరుగుతున్నాయని ఇప్పటికైనా హిందూ ధర్మాలను ఆచారించకపోతే వ్యవస్థ పూర్తి స్థాయిలో దెబ్బతింటుందన్నారు. మొదట గోవింద నామ స్మరణలతో శ్రీవారి ఆలయ గిరిప్రదక్షణ కార్యక్రమానికి ప్రవాహంలా తరలి వచ్చిన భక్తులతో స్వామి వారి ఆలయ ప్రాంగణం కాషాయివర్ణంగా మారింది. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన సమరసత సేవా ఫౌండేషన్‌ రాష్ట్ర ప్రముఖ్‌ కొండారెడ్డి, రాష్ట్ర సహ కన్వీనర్‌ ఈశ్వరయ్య, కోవూరు సింహపురి జోనల్‌ కన్వీనర్‌ పేరిశెట్ల.రమణయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ నెల్లూరు విభాగ్‌ సంఘ చాలక్‌ పల్నాటి.రామదండు, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు పాల్గొన్నారు. 
Read more