కాగితాలపూరులో భూ పోరాటం

ABN , First Publish Date - 2022-07-06T03:30:53+05:30 IST

మండలంలోని కాగితాలపూరులో మంగళవారం దళితులు భూపోరాటం చేశారు. వందలమంది దళితులు తమకు ఇళ్లస్థలాల కోసం

కాగితాలపూరులో భూ పోరాటం
కాగితాలపూరు భూపోరాటంలో తిష్టవేసిన దళితులు

 మనుబోలు, జూలై 5: మండలంలోని కాగితాలపూరులో మంగళవారం దళితులు భూపోరాటం చేశారు. వందలమంది దళితులు తమకు ఇళ్లస్థలాల కోసం భూమి కావాలంటూ సర్వేనెం. 85,86లలో ఉన్న ఐదు ఎకరాల భూమివద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రికార్డుల ప్రకారం దొడ్ల వారికి చెందిన ఈభూమిలో చూపబడిన పట్టాదారులు గ్రామంలో ఎవరూ లేరన్నారు.ఈ భూమిని గ్రామానికి చెందిన ఓ భూస్వామి దున్నేసి సాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీంతో పాటు శ్మశానానికి వెళ్ళే దారిని దున్నేశారన్నారు. ఈ భూమిని ఇళ్ళు లేని పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించాలని దళితులు డిమాండ్‌ చేశారు. భూపోరాటం దగ్గరికి పోలీసులు చేరుకుని దళితులను పంపివేశారు. ఈ విషయమై వీఆర్‌వో నాగేశ్వరరావును వివరణ కోరగా 5ఎకరాలు పట్టాభూమిగా రికార్డుల్లో ఉందన్నారు. తమకెవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదన్నారు.


Read more