జేవీవీ ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-28T23:21:11+05:30 IST

మండలంలోని 21 పాఠశాలల్లో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు.

జేవీవీ ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌

ఆత్మకూరు, అక్టోబరు 28 : మండలంలోని 21 పాఠశాలల్లో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ పోటీ పరీక్షలో 1300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేవీవీ నేతలు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. నవంబరు 18న మండల స్థాయిలో చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేవీవీ నేతలు వాగాల శ్రీహరి, వంటేరు మల్లికార్జున, సుంకు మురళీకృష్ణ, ఏ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

========

Updated Date - 2022-10-28T23:21:16+05:30 IST