ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-08-11T03:30:16+05:30 IST

రాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని న్యాయసేవా సంస్థ జిల్లా కార్యదర్శి, నెల్లూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం శ్రీనివాస్‌నాయక్‌ హెచ్చరించారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
మాట్లాడుతున్న న్యాయసేవా సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌నాయక్‌

న్యాయసేవా సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌నాయక్‌ 

కోవూరు, ఆగస్టు 10: రాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని న్యాయసేవా సంస్థ జిల్లా కార్యదర్శి, నెల్లూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం శ్రీనివాస్‌నాయక్‌ హెచ్చరించారు. గీతాంజలి ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఏర్పాటు చేసిన ర్యాగింగ్‌ వ్యతిరేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌ను క్రిమినల్‌ చర్యగా న్యాయవ్యవస్థ భావిస్తుందని చెప్పారు. సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే వారి భవిష్యత్‌ ప్రమాదంలో పడ్డట్లేనన్నారు. నూతనంగా కళాశాలలో చేరే విద్యార్ధులు, సీనియర్‌ విద్యార్థులు స్నేహపూర్వకంగా మసలుకోవాలన్నారు. సీనియర్లు జూనియర్లకు ఆదర్శపూర్వక మార్గదర్శనం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం చైర్మన్‌ ఎం సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సందీప్‌కుమార్‌, ప్రపంచ మానవ హక్కుల సంఘం డైరెక్టర్‌ ఎం కళ్యాణ్‌, ఎన్‌ఎన్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌  వై మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T03:30:16+05:30 IST