ప్రభుత్వ జూ. కళాశాలలో సరస్వతి పూజ
ABN , First Publish Date - 2022-04-26T03:19:21+05:30 IST
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సరస్వతి పూజ నిర్వహించారు. ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో క
మనుబోలు, ఏప్రిల్ 25: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సరస్వతి పూజ నిర్వహించారు. ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్ధులు సరస్వతి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం విద్యార్ధులకు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం హాల్‌టిక్కెట్లను అందించారు. శ్రద్ధగా చదివి, ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ ఆకాక్షించారు.