గుంతల రోడ్డుపై ప్రయాణం నరకం

ABN , First Publish Date - 2022-10-09T05:09:48+05:30 IST

రెండు మండలాలను కలిపే ప్రధాన రహదారి. అరగంటలో గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. అదే సైదాపురం- పొదలకూరు రోడ్డు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రతి పక్షనేతగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేరలేదు.

గుంతల రోడ్డుపై ప్రయాణం నరకం
చెరువును తలపిస్తున్న రోడ్డు

 అధ్వానంగా సైదాపురం-పొదలకూరు రోడ్డు            

ఫనెరవేరని సీఎం జగన్మోహన్‌ రెడ్డి హామీ

సైదాపురం, అక్టోబరు 8: రెండు మండలాలను కలిపే ప్రధాన రహదారి. అరగంటలో గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. అదే సైదాపురం- పొదలకూరు రోడ్డు.  సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రతి పక్షనేతగా  పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేరలేదు. డబల్‌ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు. మండల కేంద్రం సైదాపురం నుంచి పొదలకూరు మండలం డేగపూడి గ్రామం వరకు 17.8 కి.మీ దూరం ఉంది. డబల్‌ రోడ్డు సదుపాయం లేక పోవడంతో సింగిల్‌ రోడ్డుపై వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. సైదాపురం నుంచి డేగపూడి వరకు రోడ్డు మరమ్మతులకు గురైంది. రోడ్డుకు ఇరువైపులా మార్జిన్‌లు లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కలిచేడు గ్రామం వద్ద రోడ్డు బురదమయం కావడంతో  భారీ గోతులతో రొయ్యల గుంటలను తలపిస్తోంది. సైదాపురం- పొదలకూరు మధ్య ఊటుకూరు, తురిమెర్ల, కలిచేడు గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో రోడ్డు మరమ్మతులకు గురైంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఈ రెండు మండలాల మధ్య ఉన్న ప్రధాన రహదారిని  పట్టించుకోవడం లేదని వాహన చోదకులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత తిరుపతి మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు ఈ రోడ్డు దుస్థితిపై ఆర్‌అండ్‌బీ అధికారులపై అప్పట్లో సైదాపురం  మండల సర్వసభ్య సమావేశంలో మండిపడ్డారు.  ఇటీవల రూ.30లక్షల తో సైదాపురం-డేగపూడి మధ్య  తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఊటుకూరు, తురిమెర్ల, కలిచేడు గ్రామాల మధ్య భారీగా గోతులకు మరమ్మత్తులు చేయకుండా గ్రామాల చివర్లో  చేపట్టారు. దీంతో కాలి నడకకు కూడా నరకయాతనే. రోడ్డు గుతంతల మయం కావడంతో తరచుగా వాహన చోదకులు ప్రమాదాలకు గురువుతన్నారు. జగనన్న ఉయ్యాల జంపాల రోడ్డుగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్సులో ప్రయాణించేటపుడు  కుదుపులకు ఒకరుపై ఒకరు పడడంతో  ప్రయాణికుల మధ్య వాగ్వివిదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి చేపల చెరువులా, రొయ్యల గుంటలా, మాగాణి భూములా అని  విమర్శిస్తున్నారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ పట్టించు కోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 


రూ.45 కోట్లతో డబుల్‌ రోడ్డు నిర్మాణం

పి. గిరినాథ్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ

 రూ. 45కోట్ల సీఆర్‌ఎఫ్‌ నిధులతో సైదాపురం-డేగపూడి వరకు డబల్‌ రోడ్డు నిర్మాణం చేపడ్తాం.  ఊటుకూరు, తురిమెర్ల వద్ద వంతెనలకు సర్వే జరుగుతోంది. ఊటుకూరు, తురిమెర్ల, కలిచేడు, డేగపూడి గ్రామాల ప్రధాన వీధుల్లో సీసీ రోడ్లు వేస్తారు. రోడ్డుఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేసి ఆక్రమణలు తొలగించి సీసీ రోడ్లు వేస్తాం.  


Read more