జనసేన నేతలపై కేసులు ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2022-10-18T03:15:45+05:30 IST

విశాఖలో జనసేన నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్‌ డిమాం

జనసేన నేతలపై కేసులు ఎత్తివేయాలి
నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు

ఆత్మకూరు, అక్టోబరు 17 : విశాఖలో జనసేన  నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక మున్సిపల్‌ బస్టాండ్‌ సెంటర్‌లో సోమవారం జనసేన ఆధ్వర్యలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాల నేతలపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు చంద్ర, సురేష్‌, నాగరాజు, వెంకటరమణ, అనిల్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T03:15:45+05:30 IST