నేడు నెల్లూరు జిల్లాకు జగన్‌

ABN , First Publish Date - 2022-12-07T02:41:05+05:30 IST

సీఎం జగన్‌ బుధవారం నెల్లూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొంటారు.

నేడు నెల్లూరు జిల్లాకు జగన్‌

నెల్లూరు, డిసెంబరు 6 : సీఎం జగన్‌ బుధవారం నెల్లూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 3.25 గంటలకు నెల్లూరు రూరల్‌ మండలం కనుపర్తిపాడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకొంటారు. 3.45 గంటల వరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం అవుతారు. అనంతరం వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటరులో జరిగే సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహవేడుకలో పాల్గొంటారు.

Updated Date - 2022-12-07T02:41:06+05:30 IST