జేసీ సచివాలయాల సందర్శన

ABN , First Publish Date - 2022-10-05T03:02:03+05:30 IST

మండల పరిధిలోని దంపూరు, గాదెలదిన్నె, ఊటుకూరు గ్రామ సచివాలయాలను మంగళవారం జేసీ కూర్మనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భం

జేసీ సచివాలయాల సందర్శన
దంపూరులో రికార్డులు పరిశీలిస్తున్న జేసీ కూర్మనాథ్‌

విడవలూరు, అక్టోబరు 4: మండల పరిధిలోని దంపూరు, గాదెలదిన్నె, ఊటుకూరు గ్రామ సచివాలయాలను మంగళవారం జేసీ  కూర్మనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ఆనంతరం మాట్లాడుతూ దంపూరులో ఆక్రమణకు గురైన శ్మశాన స్థలాన్ని పంచాయతీకి అప్పగించి, హద్దులను చేయాలన్నారు. ఊటుకూరులో గోదామును రైతులకు  అందుబాటులో ఉండే ప్రాంతంలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు.  రికార్డులు  సక్రమంగా ఉంటే చుక్కల భూములకు పాస్‌ పుస్తకాలను జారీ చేయాలన్నారు. అయన వెంట తహసీల్దారు చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో సుబ్రహ్మణ్యం  తదితరులు ఉన్నారు.


Read more