నేటితో ఐటీడీఏకి రెండు దశాబ్దాలు పూర్తి
ABN , First Publish Date - 2022-02-05T05:14:52+05:30 IST
గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ ( ఐటీడీఏ ) ఏర్పడి నేటితో రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి.
నెల్లూరు (‘ వీఆర్సీ ) ఫిబ్రవరి 4 : గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ ( ఐటీడీఏ ) ఏర్పడి నేటితో రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. 2002 ఫిబ్రవరి 5న ఏర్పాటైన ఐటీడీఏకు తొలి ప్రాజెక్టు అధికారిగా పీ నాగిరెడ్డి కేవలం 9 రోజులు మాత్రమే ఉన్నారు అనంతరం పీవోగా ఎన్. రాజబాబు పీవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం మాత్రమే జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రంలో ఐటీడీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభమైన తర్వాత చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలకు ఇక్కడ నుంచే యానాదులకు సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం పీవోగా కనకదుర్గా భవాని విధులు నిర్వహిస్తున్నారు.