2024లోనూ జిల్లాలో క్లీన్‌స్వీప్
ABN , First Publish Date - 2022-06-26T05:02:08+05:30 IST
2024లో జరిగే ఎన్నికల్లోనూ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి చరిత్రను తిరగ రాయాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు

మంత్రి కాకాణి, ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు (జడీ ్ప) జూన్ 25 : 2024లో జరిగే ఎన్నికల్లోనూ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి చరిత్రను తిరగ రాయాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో శనివారం వైసీపీ రూరల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 2019లో వైసీపీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసిందని, 2024 ఎన్నికల్లోనూ అదే ఫలితాలు తీసుకు వాలన్నారు. చంద్రబాబుపాలనలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనపడలేదన్నారు. అందుకు భిన్నంగా ఇప్పుడు జరుగుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎంపీ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే జిల్లా ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఎంపీ బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డే బీసీలకు అత్యంత ప్రాధాన్యం కల్పించారన్నారు. సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, మేయర్ స్రవంతి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.