చదువులతోనే ఉన్నత స్థానాలు

ABN , First Publish Date - 2022-01-29T02:57:02+05:30 IST

చదువులతోనే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని యంగ్‌ గూడూర్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు చేవూరు విజయమోహన్‌రెడ్డి అన్నారు.

చదువులతోనే ఉన్నత స్థానాలు
విద్యార్థినికి ల్యాప్‌ట్యాప్‌ అందజేస్తున్న చేవూరు విజయమోహన్‌రెడ్డి

గూడూరు, జనవరి 28: చదువులతోనే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని యంగ్‌ గూడూర్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు చేవూరు విజయమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చెన్నూరులోని ఆయన నివాసంలో ఓ విద్యార్థినికి ల్యాప్‌ట్యాప్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరుకు చెందిన కర్షియాబేగం ప్రస్తుతం బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోం దని, 10వ తరగతిలో 9.5 జీపీఏ  సాధించి మైనార్టీ విభాగంలో నియోజకవర్గంలో ప్రఽథమస్థానంలో నిలవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారం అందజేసింద న్నారు. ఇంటర్‌లో కూడా 906 మార్కులు సాధించిందన్నారు. ఈమె ప్రతిభను గుర్తించి న చేవూరు అపురూప్‌రెడ్డి, నివేదిత ల్యాప్‌ట్యాప్‌ను అందజేశారన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

Read more