వీఎస్‌యూలో హెల్త్ రిహాబిలిటేషన్‌పై సదస్సు
ABN , First Publish Date - 2022-08-05T05:13:53+05:30 IST
మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో గురువారం సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన కాంపోజిట్ రీజినల్ సెంటర్ సౌజన్యంతో డిసిబిలిటీ అండ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్‌పై సదస్సు నిర్వహించారు.
వెంకటాచలం, ఆగస్టు 4 : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో గురువారం సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన కాంపోజిట్ రీజినల్ సెంటర్ సౌజన్యంతో డిసిబిలిటీ అండ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్‌పై సదస్సు నిర్వహించారు. వీఎస్‌యూ వీసీ సుందరవల్లి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారిని మనమందరం సమానంగా చూడాలని, వారి అవసరాలను తీర్చడంతోపాటు వారికి మానసిక ధైర్యాన్ని కల్పించాలని తెలిపారు. వైకల్యం ఉన్న వ్యక్తుల పునరావాసం కోసం కాంపోజిట్ రీజినల్ సెంటర్ వారు చేస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ర్టార్ డాక్టర్ పీ రామచంద్రారెడ్డి, కాంపోజిట్ రీజనల్ సెంటర్ డైరెక్టర్ మారుతికృష్ణ గౌడ్, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ విజయానంద్ కుమార్‌బాబు, సోషల్ వర్క్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ మధుమతి, డాక్టర్ కే సునీత, డాక్టర్ సుబ్బరామరాజు, డాక్టర్ బీవీ సుబ్బారెడ్డి, డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.