6500 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-08T04:31:13+05:30 IST

జిల్లాలో 6500 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీఎంఐపీ పీడీ, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బి. శ్రీనువాసులు తెలిపారు.

6500 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు లక్ష్యం
సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఏపీఎంఐపీ పీడీ శ్రీనువాసులు

 ఏపీఎంఐపీ పీడీ  శ్రీనువాసులు

మనుబోలు, అక్టోబరు 7 : జిల్లాలో 6500 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీఎంఐపీ పీడీ, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బి. శ్రీనువాసులు తెలిపారు. ఆయన శుక్రవారం స్థానిక చెత్తసంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీపీవో ఆదేశాల మేరకు మనుబోలులో పూలమెక్కల నర్సరీని ఏర్పాటు చేయను న్నామన్నారు. ఇందుకోసం స్థల పరిశీలన చేశామన్నారు. నర్సరీ ఏర్పాటుకు ఉద్యానశాఖ అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. గడిచిన రెండేళ్లలో ఏపీఎంఐపీ ద్వారా ఎలాంటి పథకాలు, రాయితీలు, సబ్సిడీలు అందించలేకపోయామన్నారు. ప్రస్తుతం రైతులకు డ్రిప్‌, స్ర్పింకర్ల సేద్యం కింద సబ్సిడీలు, రాయితీలు ఇవ్వనున్నామన్నారు. ఆసక్తిగల రైతులు ఆర్‌బీకేలలో దరఖాస్తు చేసుకుని వాటాధనం చెల్లించాలని సూచించారు.  కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అఽధికారి సుబ్బారెడ్డి, ఈవోఆర్‌డి రమణయ్య, కార్యదర్శి రమణ, విఆర్‌వో నాగార్జున రెడ్డి, ఉపసర్పంచు కడివేటి చంద్రశేఖర్‌ రెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:31:13+05:30 IST