గురువులకు ఊరట

ABN , First Publish Date - 2022-09-25T05:24:05+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులతో భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది.

గురువులకు ఊరట
డీఈవో ఆఫీస్‌

98-డీఎస్సీ అభ్యర్థులతో ఖాళీల భర్తీ

జిల్లాలో 464 మందికి అవకాశం 

ధృవపత్రాల పరిశీలనకు ఆహ్వానం 


నెల్లూరు (విద్య), సెప్టెంబరు 24 : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులతో భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. జిల్లాలో ఎంతమంది నిరీక్షణలో ఉన్నారు.. వారు ఆసక్తిగా ఉన్నారా లేదా.. ఉంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు.. అనే సమాచారాన్ని విద్యాశాఖ సేకరిస్తోంది. ఇప్పటివరకు 464 మంది తమ వివరాలను అందచేశారు. మినిమం టైమ్‌ స్కేల్‌ రూ.39వేలు వీరికి చెల్లించే పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబరు 2వతేదీ వరకు అర్హులు తమ అంగీకారాన్ని తెలియచేస్తూ ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలి. వీరి పత్రాలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలి. అక్టోబరు 6 నుంచి 14వతేదీలోపు పరిశీలన చేసి సీనియారిటీ జాబితా తయారు చేస్తారు.


50 ఏళ్లు పైబడిన వారే అధికం...


1998 డీఎస్సీలో అధికశాతం మంది 50 సంవత్సరాల వయసు పైబడినవారే ఉన్నారు. వీరంతా ప్రైవేట్‌ ఉపాధ్యాయ వృత్తిలో, కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నవారు దాదాపు 80శాతం మంది ఉన్నారు. మిగిలిన వారు ఇతర వృత్తుల్లో ఉపాధి పొందుతున్నారు. త్వరలో ప్రాధమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎజ్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించబోతున్నారు. అనంతరం బదిలీల ప్రక్రియ చేపట్టి మిగిలిపోయే ఖాళీల్లో డీఎస్సీ-98 అభ్యర్థులను నియమించినున్నారు. సరిపోకుంటే కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో అతిఽథి అధ్యాపకులుగా, సీఆర్‌పీలు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులుగా నియమిస్తారు. ఆధార్‌ కార్డుతోపాటు పూర్వానుభవం, విద్యార్హతలన్నీ పరిశీలించాక ఉద్యోగంలో నియమిస్తారు...


సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానం.


డీఎస్సీ-1998లో అర్హులైన అభ్యర్థులు డీఎస్సీ-2008 అభ్యర్థుల మాదిరిగానే మినిమం టైమ్‌ స్కేల్‌లో ఎస్‌జీటీలుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో చేరేందుకు సమ్మతం తెలిపిన అభ్యర్థులు ఈ నెల 26 నుంచి అక్టోబరు 2వతేదీ వరకు ఎస్‌ఐఎంఎస్‌ డాట్‌ ఏపీ డాట్‌ జీఓవీ డాట్‌ ఇన వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాలు పొందుపరచాలని విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.గ్లోరీకుమారి తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో అక్టోబరు 6 నుంచి 14వతేదీ వరకు నెల్లూరులోని మూలాపేట ఈఎ్‌సఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో హాజరై ధ్రువీకరించుకోవాలన్నారు. సీఎ్‌సఈ వెబ్‌సైట్‌లో సమ్మతి తెలియచేసిన డీఎస్సీ-98 అభ్యర్థుల జాబితాను డీఈఓ నెల్లూరు డాట్‌ 50 వెబ్స్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ జాబితాలో ఉన్నవారు మాత్రమే వెరిఫికేషనకు హాజరు కావాలని సూచించారు. 

Read more