విద్యార్థులకు గుణాత్మకమైన విద్యే లక్ష్యం

ABN , First Publish Date - 2022-12-22T23:44:06+05:30 IST

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ట్యాబ్‌ల పంపిణీకి సీఎం జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యే లక్ష్యం
విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న మంత్రి కాకాణి

వెంకటాచలం, డిసెంబరు 22 : విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ట్యాబ్‌ల పంపిణీకి సీఎం జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కనుపూరు జడ్పీ హైస్కూల్‌లో గురువారం 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీలో మంత్రి కాకాణి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అనంతరం మండలంలోని పులతీగలపాడు, కందలపాడు గ్రామాల్లో కనుపూరు మెయిన్‌ కెనాల్‌పై సుమారు రూ.60లక్షలతో నిర్మించిన రెండు వంతెనలను ప్రారంభించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ డీఈ నాగరాజు, ఎంపీడీవో సుస్మిత, తహసీల్దారు నాగరాజు, ఎంపీపీ మంద కవిత, శివ, వల్లూరు లక్ష్మమ్మ, హెచ్‌ఎం కృష్ణారెడ్డి, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ సుబ్రహ్మణ్యం, మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

చుక్కల భూముల సమస్య పరిష్కారం!: మంత్రి కాకాణి

పొదలకూరు: జిల్లాలో 22వేల ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కారానికి మరో 15 నుంచి 20 రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం భోగసముద్రంలో గురువారం ఆయన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అంతకుముందు మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-22T23:44:09+05:30 IST