గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

ABN , First Publish Date - 2022-11-15T22:55:28+05:30 IST

స్థానిక గ్రంథాలయంలో మంగళవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. లైబ్రియన్‌ శ్రీనివాసరాజు గ్రంథాలయంలోని పుస్తకాలను ప్రదర్శనకు పెట్టారు.

గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన
ఆత్మకూరు : గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను తిలకిస్తున్న విద్యార్థులు, పాఠకులు

ఆత్మకూరు, నవంబరు 15: స్థానిక గ్రంథాలయంలో మంగళవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. లైబ్రియన్‌ శ్రీనివాసరాజు గ్రంథాలయంలోని పుస్తకాలను ప్రదర్శనకు పెట్టారు. కార్యక్రమానికి హాజరైన జూనియర్‌ కళాశాల అధ్యాపకులు హజరత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కనుపూరుపల్లి పాఠశాల హెచ్‌ఎం. అనిల్‌కుమార్‌ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 20 వరకు జరిగే పుస్తక ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని లైబ్రియన్‌ కోరారు.

కరెన్సీ నోట్లు, నాణేల ప్రదర్శన

అనంతసాగరం, నవంబరు 15: స్ధానిక గ్రంథాలయంలో జాతీయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యఅతిఽథిగా ఎంఈవో బాలకృష్ణారెడ్డి పాల్గొని పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారు. ఏఎస్‌పేట నివాసి షేక్‌ వాయిజ్‌ అహ్మద్‌ 172 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, నాణేలను ప్రదర్శనలో ఉంచగా విద్యార్ధులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్‌ నారాయణరావు, శాంతినికేతన డైరెక్టర్‌ ప్రభాకర్‌, జేవీవీ నాయకుడు వేము పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంగం : స్థానిక గ్రంథాలయంలో మంగళవారం పుస్తక ప్రదర్శన ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు శ్రీనివాసులురెడ్డి, పశువైద్యాధికారి సురేష్‌ బాబులు రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని పుస్తక ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో డ్రాయింగ్‌ టీచర్‌ తిరుపతయ్య, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాధికారి రవీంద్రనాథ్‌రెడ్డి అతిథులను సత్కరించారు.

Updated Date - 2022-11-15T22:55:31+05:30 IST