ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-12-07T23:47:59+05:30 IST
రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూటూరు మురళీ కన్నబాబు విమర్శించారు.
చేజర్ల, డిసెంబరు 7: రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూటూరు మురళీ కన్నబాబు విమర్శించారు. బుధవారం మండలంలోని ఆదురుపల్లిలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని మండలంలో చేపట్టనున్నట్లు, రానున్న 30రోజుల్లో ఇంటింటా తిరిగి, వారి సమస్యలు తెలుసుకుని, అక్కడి నుంచి ఈ నెంబరుకు 92612 92612 మిస్స్డ్ కాల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తిరిగి వెంటనే కాల్ రాగానే ప్రజా సమస్యలు తెలుసుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సమస్యలను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రావి లక్ష్మీనరసారెడ్డి, వెంకటయ్య, పెంచలనాయుడు, మదమంచి సుధీర్, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.