ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు: తహసీల్దారు

ABN , First Publish Date - 2022-12-07T00:07:07+05:30 IST

మండలంలోని బీమవరం రెవెన్యూ సర్వే నెం.539లో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని చుట్టూ ముళ్లకంచెలతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు: తహసీల్దారు
ఆక్రమణకు గురైన భూమిని పరిశీలిస్తున్న తహసీల్దారు హేమంత్‌కుమార్‌

మర్రిపాడు, డిసెంబరు 6: మండలంలోని బీమవరం రెవెన్యూ సర్వే నెం.539లో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని చుట్టూ ముళ్లకంచెలతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. దీంతో చుట్టు పక్కల రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు దారి లేకపోవటంతో వారు ఇటీవల తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్‌కు అర్జీలు ఇవ్వడంతో మంగళవారం తహసీల్దారు హేమంత్‌కుమార్‌ ఆ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేసిన ఫెన్సింగ్‌ను 3 రోజులలోగా తొలగించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆక్రమణదారులను హెచ్చరించారు.

Updated Date - 2022-12-07T00:07:08+05:30 IST