గరుడసేవలో లక్ష్మీనరసింహస్వామి

ABN , First Publish Date - 2022-03-17T04:57:55+05:30 IST

ఇందుకూరుపేట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మోహిని అలంకారంలో స్వామివారు భక్తులను కనువిందు చేశారు.

గరుడసేవలో లక్ష్మీనరసింహస్వామి
మోహినీ అలంకారంలో నరసింహస్వామి

ఇందుకూరుపేట, మార్చి 16 : ఇందుకూరుపేట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మోహిని అలంకారంలో స్వామివారు భక్తులను కనువిందు చేశారు. ఉదయం విశేష పూజలు, అలంకారాలు జరిపారు. అనంతరం రాత్రి గరుడ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయదాతగా జొన్నలగడ్డ మధుసూదన్‌రావు వ్యవహరించారు. ఈవో రామకృష్ణ, అర్చకులు ఉదయగిరి వెంకట శేషాచార్యులు, నందకిషోర్‌, రంగాచార్యులు, నరేష్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఫోటోరైటప్‌

======= 

2/ఐపేట/ 16 : అవార్డులు ప్రధానం చేస్తున్న అధికారులు

 

వైద్య సిబ్బందికి ఉత్తమ అవార్డుల ప్రదానం

ఘనంగా జాతీయ టీకా దినోత్సవం


ఇందుకూరుపేట, మార్చి 16 : మండలంలోని పల్లెపాడు డైట్‌ కాలేజీ ఆడిటోరియంలో జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా బుధవారం మైపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉత్తమ ఏఎన్‌ఎం, ఉత్తమ ఆశాలకు జిల్లాస్థాయి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎం శైలజ(పల్లెపాడు), ఆశాలు వనజ (పల్లెపాడు), శైలజ (మైపాడు)లు అవార్డులు అందుకున్నారు. వీరు పిల్లలకు, గర్భిణులకు టీకాలు వేయడంలో అత్యుత్తమ సేవలు అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నెల్లూరు రవీంద్రరెడ్డి, రెడ్డిపోగు సుధాకర్‌, గూడూరు జయరామయ్య, డాక్టర్‌ బ్రహ్మేంద్రనాయుడు, కొల్లపూడి శ్రీనివాసులురెడ్డి, మంజుల టీచర్‌, సుధాకర్‌రెడ్డి, రమాదేవి, డైట్‌ ప్రిన్సిపాల్‌ సింగ్‌ పాల్గొన్నారు.  

కోవూరు : జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా ఇనమడుగు ప్రభుత్వ వైద్యశాల పరిధిలోని బాలలందరికీ టీకాలు వేసిన సిబ్బందిని సర్పంచు ప్రమీలమ్మ బుధవారం ఘనంగా సన్మానించారు. నూరుశాతం బాలలకు టీకాలు వేసిన ఏఎన్‌ఎం పెంచలమ్మ, ఆశా కార్యకర్తలు మాధవి, కల్పనలకు శాలువాలకు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్‌ ఇర్ఫాన్‌, డాక్టర్‌ రవి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్య సిబ్బంది దీక్షతో పనిచేశారని తెలిపారు. కాగా కరోనా నిరోధక వ్యాక్సిన్లను విద్యార్థులకు వేస్తున్నామన్నారు. 

తోటపల్లిగూడూరు : మండలంలోని వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఐ.జిజియాబాయి ఆధ్వర్యంలో బుధవారం జాతీయ టీకా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీకాలు వేసుకునే విషయంలో ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. అనంతరం 100శాతం టీకా లక్ష్యాన్ని అధిగమించిన సిబ్బందికి అవార్డులు అందించి సన్మానించారు. వీరిలో బీఎస్‌ రజినికుమారి, ఐ.నీరజ, మధుసూదనమ్మ ఉన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలను వైద్యాధికారి డాక్టర్‌ కె.షాలిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో నారాయణరెడ్డి, పీహెచ్‌ఎన్‌ ప్రపుల్లా, ఎంపీహెచ్‌ఎస్‌ బీ.పెంచలయ్య, కే. వరలక్ష్మమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 


=================

Updated Date - 2022-03-17T04:57:55+05:30 IST