ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
ABN , First Publish Date - 2022-08-08T02:33:31+05:30 IST
స్థానిక కొత్తూరులో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బాలచౌడేశ్వరి ఆల
సంగం, ఆగస్టు 7: స్థానిక కొత్తూరులో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బాలచౌడేశ్వరి ఆలయంలో చేనేత కార్మికులు రాట్నం ఒడికి దినోత్సవం జరుపుకున్నారు. అనంతరం సీనియర్ నేత కార్మికులకు శాలువా కప్పి సత్కరించారు. కేక్ కట్ చేసి కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేత కార్మికులు పాల్గొన్నారు.