విక్కిరాలపేటలో గడప గడపకు మన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-10-08T03:58:00+05:30 IST

మండలంలోని విక్కిరాలపేటలో శుక్రవారం ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

విక్కిరాలపేటలో గడప గడపకు మన ప్రభుత్వం
విక్కిరాలపేటలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి

కందుకూరు, అక్టోబరు 7: మండలంలోని విక్కిరాలపేటలో శుక్రవారం ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రతి ఇంట్లో ఆ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా అందిన ఆర్థిక సహాయం వివరాలను తెలపటంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు పారిశుధ్యం నిర్వహణ, స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఓ వృద్ధుడు తనకు కళ్లు కనిపించటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తేగా తగిన వైద్యం చేయించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీడీవో విజయశేఖర్‌, తహసీల్దారు డి.సీతారామయ్య, గంగవరపు వెంకటరావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-08T03:58:00+05:30 IST