-
-
Home » Andhra Pradesh » Nellore » Farmers welfare government aim-MRGS-AndhraPradesh
-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2022-03-06T03:31:40+05:30 IST
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే ఆనం
డక్కిలి, మార్చి 5 : రైతు సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం డక్కిలిలో వ్యవసాయశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 23 గ్రూపులకు ఒక్కో దానికి రూ. 12 లక్షల సబ్సిడీతో వరి నూర్పిడి యంత్రాలను మంజూరు చేశామన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇందుకు గాను మండలంలో 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ యంత్రసేవ పథకం కింద వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టరు అందుబాటులోకి తెచ్చామన్నారు. జేడీఏ అనిత, ఏడీ నాగార్జునసాగర్, ఏవో సుజాత, తహసీల్దార్ ప్రసాద్, జిల్లా సెంట్రల్ బ్యాంకు డైరెక్టరు వెలికంటి రమణారెడ్డి, ఎంపీపీ గోను రాజశేఖర్, నాయకులు మునిరాంరెడ్డి, అలిమిలి చంద్రారెడ్డి, నర్రావుల వేణుగోపాల్ నాయుడు, బొల్లినేని బాస్కరనాయుడు, దువ్వూరు రవీంద్రారెడ్డి, గడ్డం చంద్రశేఖరరెడ్డి, పొనుగోటి మల్లి, చింతల శ్రీనివాసులరెడ్డి, ఈశ్వరయ్య, వేముల నాగభూషణం నాయుడు, వేముల రాజమోహన్‌నాయుడు, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.