రైతు పోరు సభకు తరలుతున్న రైతులు, టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2022-07-22T05:11:13+05:30 IST
మనుబోలు వద్ద గురువారం ఏర్పాటు చేసిన రైతు పోరు బాట సభకు మండలం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య ఆధ్వర్యంలో నాయకులు, రైతులు తరలివెళ్లారు.
బుచ్చిరెడ్డిపాళెం, జూలై 21 : మనుబోలు వద్ద గురువారం ఏర్పాటు చేసిన రైతు పోరు బాట సభకు మండలం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య ఆధ్వర్యంలో నాయకులు, రైతులు తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి టెంపోలు, కార్లు, తదితర వాహనాలలో సుమారు 400మంది రైతులతో రైతు సదస్సుకు తరలి వెళ్తున్నట్టు శేషయ్య తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దుగ్గిశెట్టి హరనాథ్, శేఖరయ్య, దయాకర్‌రెడ్డి, వి.శ్రీనివాసులుచ వింజం మహేష్, కొండయ్య, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వెంకటాచలం : మనుబోలులో గురువారం సాయంత్రం జరిగిన రైతు పోరు బాట సభకు మండలంలోని అన్ని పంచాయతీల నుంచి రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వెళ్లారు. ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో తెల్లచొక్కాలు, పంచెలు, పచ్చ కండువాలు ధరించి వెళ్లారు. కార్యక్రమంలో గుమ్మడి రాజాయాదవ్, కుంకాల నాగేంద్రప్రసాద్, రావూరి రాధాకృష్ణమనాయుడు, మావిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు, ఉప్పల పాటి ధనుంజయనాయుడు, చల్లా నాగార్జున్‌రెడ్డి, వల్లూరు రమేష్ నాయుడు ఉన్నారు.
ఇందుకూరుపేట : మనుబోలు ప్రాంతంలో నిర్వహించే రైతు పోరు బాట సభకు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మండలం నుంచి దాదాపు 100 వాహనాల్లో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ప్రతి గ్రామం నుంచి ఐదు వాహనాల్లో అభిమానులు తరలి వెళ్లారు. మండల నాయకులు వీరేంద్రచౌదరి, చెంచుకిషోర్‌యాదవ్, మునగాల రంగారావు, ఇంతియాజ్, పేడూరు రామచంద్రయ్య, తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలిరావడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని టీడీపలో కొత్త ఉత్సాహం కనిపించిందని నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొడవలూరు :టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు మనుబోలుకు వాహనాల్లో తరలి వెళ్లారు. అమరేంద్రరెడ్డి మాట్లాడుతూ రైతులకు న్యాయం జరగాలంటే టీడీపీ అధికారం చేపట్టాలని అన్నారు.
