ఉద్యోగ విరమణ సహజమే
ABN , First Publish Date - 2022-08-08T02:57:21+05:30 IST
ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు.

ఉదయగిరి రూరల్, ఆగస్టు 7: ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండలంలోని ఆర్లపడియ బ్రాంచ్ పోస్టుమాస్టర్ ముట్టుకుంటు తిరుపతిరెడ్డి ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేశారు. ఆయనకు ఆదివారం గండిపాళెం సబ్ పోస్టాఫీసులో సిబ్బంది సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 46 ఏళ్లపాటు ఆర్లపడియ బీపీఎంగా పని చేసిన తిరుపతిరెడ్డి ఎలాంటి మచ్చలేకుండా ప్రజల మన్ననలు పొందారన్నారు. ఆలిండియా గ్రామీణ డాక్సేవక్స్ యూనియన్ నెల్లూరు డివిజన్ ఆఽధ్యక్షుడిగా సంఘ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వారిని శాలువాలు, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్టుమాస్టర్ శివప్రసాద్, పోస్టల్ అసిస్టెంట్ రఫీ, వెంకట్రావు, యూనియన్ నాయకులు బుర్రి చిన్నతిరుపాలయ్య, నాగరాజు, రమేష్, సతీష్ మాజీ ఎంపీటీసీ అడుసుమల్లి వెంకటేశ్వర్లు, పలువురు బీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.