ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-05-18T03:39:58+05:30 IST

ఆత్మకూరులోని ఫర్టిలైజర్స్‌ దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు
ఎరువుల దుకాణంలో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ఆత్మకూరు, మే 17: ఆత్మకూరులోని ఫర్టిలైజర్స్‌ దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో అనుమతిలేని, అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా బస్తాలను సీజ్‌ చేశారు. సిండికేట్‌ ఫార్మర్‌ సొసైటీలో సుమారు రూ. 18,35,000 విలువ చేసే 1913 బస్తాలు, అలాగే మన గ్రోమోర్‌లో సుమారు రూ. 33,06,000 విలువ చేసే 3823 బస్తాలు సీజ్‌ చేసినట్లు వారు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్‌ సీఐ మాణిక్యరావు, సిబ్బంది, స్థానిక వ్యవసాయాధికారి పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T03:39:58+05:30 IST