విద్యా సామగ్రికి నిప్పంటించిన వ్యక్తులు

ABN , First Publish Date - 2022-08-10T04:28:31+05:30 IST

స్థానిక హైస్కూల్‌లోని ఓ గదిలో ఉండే విద్యా సామగ్రికి గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం నిప్పంటించారు.

విద్యా సామగ్రికి నిప్పంటించిన వ్యక్తులు
గదిలో కాలి బూడిదైన విద్యా సామగ్రి

మర్రిపాడు, ఆగస్టు 9: స్థానిక హైస్కూల్‌లోని ఓ గదిలో ఉండే  విద్యా సామగ్రికి గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం నిప్పంటించారు. సమాచారం తెలుసుకున్న వాచ్‌మన్‌ అక్కడికి వచ్చేలోపే అందులోని పుస్తకాలు, బూట్లతోకూడిన జగనన్న విద్యాకానుక సామగ్రి కాలిపోయాయి. వాచ్‌మన్‌ నీటితో మంటలను  అదుపు చేసిన అనంతరం  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నారు. అందుకు భాధ్యులపై కఠిన చర్యలుంటాయని  తెలిపారు. వివరణ కోసం ప్రధానోపాధ్యాయుడికి ఫోన్‌ చేసినా ఫోన్‌ అందుబాటులోకి రాలేదు.

Updated Date - 2022-08-10T04:28:31+05:30 IST