హెల్త్‌ సెక్రటరీ రాజ్యలక్ష్మికి డాక్టరేట్‌

ABN , First Publish Date - 2022-09-11T05:19:34+05:30 IST

నగరంలోని మూలాపేట సచివాలయ హెల్త్‌ సెక్రటరీ చెంజి రాజ్యలక్ష్మి డాక్టరేట్‌ సాధించారు.

హెల్త్‌ సెక్రటరీ రాజ్యలక్ష్మికి డాక్టరేట్‌
రాజ్యలక్ష్మి

నెల్లూరు (విద్య) సెప్టెంబరు 10 : నగరంలోని మూలాపేట సచివాలయ హెల్త్‌ సెక్రటరీ చెంజి రాజ్యలక్ష్మి డాక్టరేట్‌ సాధించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ పరిశోధక విద్యార్థినిగా ఆమె పీహెచ్‌డీ అందుకున్నారు. ఆచార్య ఎన్‌ఎన్‌ మూర్తి పర్యవేక్షణలో బయోకెమికల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఆన్‌ ది ఎఫెక్ట్‌ ఆఫ్‌ సెలెక్టడ్‌ మెటల్‌ ఆయాన్స్‌ ఆన్‌ ఫోటోసింథసిస్‌ ఆఫ్‌ మైజ్‌ ప్లాంట్‌ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించినట్లు ఆమె వెల్లడించారు. అలాగే పలు జాతీయసదుస్సల్లో సైతం ఈ అంశంపై పరిశోధన పత్రాలను సమర్పించడంతో తనకు డాక్టరేట్‌ లభించినట్లు  తెలిపారు. ఈ సందర్బంగా ఆమెను సహచర సిబ్బంది అభినందించారు. 

Read more