డివిజన్‌ మార్పును వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు

ABN , First Publish Date - 2022-08-17T03:16:37+05:30 IST

బుచ్చి ఇరిగేషన్‌ సబ్‌డివిజన్‌లోని సంగం సెక్షన్‌ను ఆత్మకూరు డివిజన్‌లో కలుపుతూ చేసిన మార్పును వెంటనే వెనక్కి

డివిజన్‌ మార్పును   వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు
విలేకరులతో మాట్లాడుతున్న డీసీసీబీ, డీఏఏబీ చైర్మన్లు, రైతు సంఘం నాయకులు

ఇరిగేషన్‌ ఎస్‌ఈకి నేతల హెచ్చరిక

బుచ్చిరెడ్డిపాళెం,ఆగస్టు16: బుచ్చి ఇరిగేషన్‌ సబ్‌డివిజన్‌లోని సంగం సెక్షన్‌ను ఆత్మకూరు డివిజన్‌లో కలుపుతూ చేసిన మార్పును వెంటనే వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరిగేషన్‌ ఎస్‌ఈని డీసీఎంఎస్‌, డీఏఏబీ చైర్మన్లు, వైసీపీ రైతు సంఘం నాయకుడు  హెచ్చరించారు. మంగళవారం డీసీఎంఎస్‌, డీఏఏబీ చైర్మన్లు వీరి చలపతిరావు, దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డితోపాటు పలువురు వైసీపీ నాయకులు బుచ్చి ఇరిగేషన్‌ బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఇరిగేషన్‌శాఖలో తాత్కాలికంగా కూడా మార్పు చేసే అఽధికారం  ఎస్‌ఈ కృష్ణమోహన్‌కు లేదన్నారు. తన స్వంత నిర్ణయంతో చేసిన  ఈ మార్పును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇటీవల బుచ్చి సబ్‌డివిజన్‌ను కోవూరులో కలిపితే నానా ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు.  సంగం సెక్షన్‌ను ఆత్మకూరులో కలపడంపై సీఈని అడిగితే తనకు సంబంధంలేదని చెప్పారన్నారు. నీటిపారుదలశాఖ మంత్రి అంబటిని కలిసి ఎమ్మెల్యే ప్రసన్న వినతిపత్రం ఇచ్చిన తరువాత దీనిపై అభ్యంతరం వచ్చినట్టు ఫోన్‌లో మెసేజ్‌ పెట్టారన్నారు.  ఎస్‌ఈ తన నిర్ణయాన్ని  రెండు మూడు రోజుల్లో వెనక్కితీసుకోకుంటే  ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  పెన్నాడెల్టా మాజీ చైర్మన్‌ ఎర్రంరెడ్డి గోవర్దన్‌రెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, కోడూరు మధుసూదన్‌రెడ్డి, టంగుటూరు మల్లారెడ్డి, ఇప్పగుంట విజయభాస్కర్‌రెడ్డి, చెర్లో సతీష్‌రెడ్డి, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.


----------


Updated Date - 2022-08-17T03:16:37+05:30 IST