పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-07-05T05:37:12+05:30 IST

పత్తి రైతులు సస్యరక్షణ చేపట్టడంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి జి.సుధాకర్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని

పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ఆత్మకూరు, జూలై 4 : పత్తి రైతులు సస్యరక్షణ చేపట్టడంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి జి.సుధాకర్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని రావులకొల్లు, నాగుల పాడు, చెర్లోయడవల్లి గ్రామాల్లో సోమవారం క్షేత్ర సందర్శనలో భాగంగా సాగులో ఉన్న పత్తి పంటలను రైతులతో కలిసి సందర్శించారు. గులాబీ రంగు పురుగును తగు సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వివరించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డి.సురేఖాదేవి  100 రోజులు దాటిన పత్తి పంటలో గులాబీ రంగు పురుగును గుర్తించినప్పుడు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ కోఆర్డినేటర్‌ పి.సత్యవాణి, ఏరువాక కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఓబయ్య, ఆత్మకూరు వ్యవసాయ ఉపసంచాలకులు వి.దేవసేన, మండల వ్యవసాయాధికారి కె.కిషోర్‌బాబు, ఏఈవో కె.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:37:12+05:30 IST